Niharika Konidela: మెగా డాటర్ నిహారిక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందా..? అంటే దానికి సమాధానం నిహారికనే చెప్పాలి. నెటిజన్లు మాత్రం హీరోయిన్ గా వచ్చేయ్ అంటూ సపోర్ట్ చేస్తుండడం విశేషం. మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. మెగా కుటుంబం నుంచి హీరోయిన్ గా వచ్చిన మొదటి అమ్మాయి నిహారికనే. ఒక మనసులాంటి ఫీల్ గుడ్ సినిమాలో నిహారిక నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. అయితే కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ ను అందుకోలేదు. ఆ తరువాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి కూడా అమ్మడికి హిట్ ను అందించలేదు. ఇక దీంతో హీరోయిన్ గా సెట్ అవ్వను అనుకున్నదో ఏమో నిహారిక.. పెళ్లి చేసుకోవడానికి సిద్దపడింది. మూడేళ్ళ క్రితం జొన్నలగడ్డ చైతన్యను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఎంతైనా సినిమా కుటుంబంలోనే పుట్టి పెరగడం వలన అనుకుంటా ఆ రంగాన్ని విడిచిపెట్టలేకపోయింది. హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా సినిమారంగంలో అడుగుపెట్టింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ను పెళ్ళికి ముందే స్థాపించినా.. పెళ్లి తరువాత దాన్ని సీరియస్ గా తీసుకొని వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ హిట్లు అనుకుంది.
Allu Ramesh: యూట్యూబ్ ను షేక్ చేసిన ‘మా విడాకులు’ మామయ్య ఇక లేరు
ఇక మూడేళ్ల వైవాహిక జీవితంలో నిహారిక- చైతన్యల మధ్య విబేధాలు మొదలయ్యాయి అని, ఈ జంట విడాకులు కూడా తీసుకున్నారు అని వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేసుకున్నారు. ఈ విషయమై మెగా కుటుంబం కానీ, నిహారిక కానీ నోరు విప్పింది లేదు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ విడాకుల రూమర్స్ ను ఆపడానికి పెడుతుందా..? లేక హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి మొదలుపెట్టిందా..? అనేది తెలియదు కానీ, గత కొన్నిరోజులుగా నిహారిక నిత్యం ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. ముఖ్యంగా అమ్మడు చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తోంది. అంతకు ముందుకు.. ఇప్పటికి మెగా డాటర్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతమని చెప్పాలి. తాజాగా వంగపువ్వు కలర్ చీరలో మెగా డాటర్ మత్తెక్కిస్తోంది అని చెప్పాలి. కర్లీ హెయిర్, ముక్కుకు ముక్కెరతో మెగా వారసురాలు ఎంతో అందంగా ఉంది. దీంతో అభిమానులు హీరోయిన్ గా మళ్లీ ఎంట్రీ ఇస్తున్నారా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి నిహారిక మనసులో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా..? అనేది తెలియాల్సి ఉంది.
