Niharika Konidela: వాట్ ది ఫిష్.. మంచు హీరోతో మెగా డాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగా నిలబడడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు మంచి గుర్తింపు ఉంది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక.. సినిమాలు అయితే చేసింది కానీ, ఆశించిన ఫలితాలను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తరువాత నటిగా కాకుండా నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు నిర్మించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక మూడేళ్లు కూడా కాకముందే విబేధాల కారణంగా భర్తకు విడాకులు ఇచ్చి.. మళ్లీ తండ్రి ఇంటికి చేరింది. అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ నటనవైపు దృష్టి సారించింది. ఫిట్ నెస్ మీద ఫోకస్ చేసి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ఫోటోషూట్స్ తో పిచ్చెక్కిస్తోంది. ఒకపక్క నిర్మాతగా ఉంటూనే.. ఇంకోపక్క నటిగా కూడా తనవంతు ప్రయత్నం తాను చేస్తోంది.
ఇక తాజాగా నిహారిక.. మంచు మనోజ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. మంచు మనోజ్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం వాట్ ది ఫిష్. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 6ix సినిమాస్ బ్యానర్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. నేడు నిహారిక పుట్టినరోజు కావడంతో.. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నిహారిక అల్ట్రా మోడ్రన్ సురేష్ లో అదిరిపోయింది. సిల్వర్ కలర్ గ్లిట్టర్ డ్రెస్ లో ఆమె ఎంతో అందంగా కనిపించింది. మంచు మనోజ్ సినిమాలో నిహారిక ఇలాంటి ఒక పాత్ర చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. మరి ఈ సినిమాతో నిహారిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లెనిన్'
- Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
- Mega158: బర్త్‌డే స్పెషల్‌గా 'మెగా158' బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
- Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
తాజావార్తలు
-
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
-
Tesla Model Y: టెస్లా మోడల్ Y ఇప్పుడు గ్రోక్ AI ఫీచర్‌తో.. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో మాట్లాడే AI అసిస్టెంట్
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది’
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!