Site icon NTV Telugu

Niharika: లిప్‌లాక్ ఫోటోతో ఆ రూమర్లకు చెక్

Niharika Clarity On Divorce News

Niharika Clarity On Divorce News

నిహారిక, చైతన్యల పెళ్ళి జరిగి ఎక్కువ కాలం కాలేదు.. కానీ, అప్పుడే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఇద్దరు దూరంగా ఉంటున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా.. సఫలం కాలేదని ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ గానీ, వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో.. నిహారిక, చైతన్యల మధ్య నిజంగానే విభేదాలున్నాయేమోనని అంతా అనుకున్నారు. ఇక ఇటీవల ఓ నైట్ పార్టీలో నిహారిక అరెస్ట్ అవ్వడం, దానిపై చైతన్య నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. వీళ్ళిద్దరు విడిపోయారని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యమంటూ కథనాలు వచ్చాయి.

కానీ, ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ కేవలం ఒకే ఒక్క ఫోటోతో నిహారిక క్లారిటీ ఇచ్చేసింది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటోన్న ఈ మెగా డాటర్, తాజాగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోల్ని షేర్ చేసింది. వాటిల్లో ఒక లిప్‌లాక్ ఫోటో కూడా ఉంది. దీంతో.. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, సంతోషంగా తమ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలావుండగా.. నిహారిక ఇటీవలే ఒక సినిమాని ప్రారంభించింది. ప్రముఖ ఓటీటీ సంస్థతో కలిసి, ఆమె ఈ సినిమాని నిర్మిస్తోందని సమాచారం.

Exit mobile version