Site icon NTV Telugu

Alia Bhatt : అలియా భట్ కి నిహారిక ఛాలెంజ్

Alia

Alia

‘గంగూభాయ్ కతియావాడి’ పేరు వినగానే సినిమా సంగతి ఎలా ఉన్నా అందులో నటించిన అలియా భట్ లుక్ వెంటనే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. తెల్లటి కాటన్ చీర మ్యాచింగ్ బ్లౌజ్, గాగుల్స్ ధరించి రెట్రో లుక్స్ లో కనిపించిన అలియా కోసమే ఆ సినిమా పదే పదే చూసిన వారున్నానటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా రిలీజ్ తర్వాత చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ తో పాటు పలువురు నటీమణులు ‘గంగూభాయ్’ రూపాన్ని కాపీ కొట్ట డానికి ప్రయత్నించారు.

ఇప్పుడు నిహారిక కొణిదెల వంతు వచ్చింది. తరుచూ కాస్ట్యూమ్‌ పార్టీలకు హాజరయ్యే నీహారికి గత రాత్రి ఓ కాస్ట్యూమ్ పార్టీకి ఆలియా భట్ ‘గంగూభాయ్’ లుక్‌లో వాలిపోయింది. గంగూ లుక్ లో నీహారిక అందరినీ ఆకట్టుకుంది. తన లుక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది నీహారిక. ‘ఛాలెంజింగ్ గంగూ’ అంటూ తనకు కాస్ట్యూమ్ పార్టీలు అంటూ ఎప్పుడూ ఇష్టమని ట్వీట్ చేసింది. తన వెనుక ఉన్న కోతులను పట్టించుకోవద్దని కూడా అనేసింది. ఇక వర్క్ విషయానికి వస్తే నిహారిక ఇటీవలే ‘హలో వరల్డ్’ అనే వెబ్ సిరీస్‌ నిర్మించింది. మరో రెండు షోలను నిర్మించే ప్లానింగ్ లో ఉంది. మరి ఓటీటీలో నిర్మాణానికే పరిమితం అవుతుందా? లేక మరోసారి వెండితెరపై ఎంట్రీ ఇస్తుందా అన్నది చూడాలి.

Exit mobile version