Site icon NTV Telugu

Nidhi Agarwal : ఐదేళ్లు ఫైనాన్షియల్ గా మేనేజ్ చేశా.. ‘నిధి’ ఎమోషనల్..

Nidhiagerwal

Nidhiagerwal

Nidhi Agarwal : హరిహర వీరమల్లు మూవీ జులై 24న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తోంది. అయితే ఈ సినిమా మొదలై ఐదేళ్లు అవుతోంది. ఇన్నేళ్లుగా మూవీ వాయిదాలు పడుతూనే వచ్చింది. ఇన్నేళ్లు పడుతుందనే విషయం నిధి అగర్వాల్ కు తెలియదు. అందుకే మూవీకి ఒప్పుకుంది. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్ కు ఇన్నేళ్లు పట్టింది. అయితే ఈ ఐదేళ్లు నిధి వేరే సినిమాలు కూడా పెద్దగా చేయలేదు. ఎందుకంటే అందుకు నిధి చేసుకున్న వీరమల్లు అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమా అయిపోయేదాకా వేరే మూవీలు ఒప్పుకోవడానికి వీళ్లేదు.

Nidhi Agarwal : SSMB 29 : ఆస్కార్ కోసం రాజమౌళి భారీ ప్లాన్..?

మరి ఈ ఐదేళ్లు ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిధి ఆన్సర్ ఇచ్చింది. ప్రతి నెల నాకు ఒక్క షాప్ ఓపెనింగ్ అయినా వచ్చేది. దాంతో పాటు యాడ్ ప్రమోషన్లు కూడా వచ్చాయి. అందుకే వాటితో మేనేజ్ చేశాను. ఇన్నేళ్లు ఆలస్యం అయినా ఓ మంచి పాత్రతో వస్తున్నాను అనే మంచి ఫీల్ అయితే ఉంది. అంటూ తెలిపింది నిధి అగర్వాల్. ఆమె చెప్పినట్టే చాలా రోజులుగా ఆమె యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

Nidhi Agarwal : Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్.. లేటెస్ట్ పిక్ చూశారా..

Exit mobile version