NTV Telugu Site icon

Nidhi Agarwal : ప్రభాస్, పవన్ ఆమెను సౌత్ లో స్టార్ ను చేస్తారా..?

Nidhi

Nidhi

Nidhi Agarwal : ఒక హీరోయిన్ స్టార్ కావాలంటే ఒకటి, రెండు పెద్ద హిట్లు కచ్చితంగా కావాలి. అందులోనూ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. పాన్ ఇండియా సినిమాల్లో నటించి హిట్ కొట్టాల్సిందే. అప్పుడు ఒకేసారి నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోవచ్చు. ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకుంది. అందులో ఒకటి పవన్ కల్యాణ్‌ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా, ఇంకొకటి రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్న ది రాజాసాబ్ మూవీ. ఈ రెండింటిలోనూ ఏది హిట్ అయినా ఆమె దశ తిరిగిపోతుంది.

Read Also : Vikram : టాలీవుడ్ ఇండస్ట్రీని చూస్తే అసూయగా ఉంది

హరిహరి వీరమల్లు సినిమా మే 9న రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్‌ నుంచి వస్తున్న సినిమా ఇది. ఏ కొంచెం హిట్ టాక్ వచ్చినా వసూళ్లను ఆపడం కష్టమే. అటు ది రాజాసాబ్ మూవీని కూడా ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా హర్రర్ కథతో వస్తోంది. ఇది కూడా హిట్ టాక్ తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూవీ ఏ కొంచెం హిట్ అయినా సరే నిధి అగర్వాల్ కు స్టార్ ఇమేజ్ రావడం పక్కా అంటున్నారు సినిమా నిపుణులు.