Site icon NTV Telugu

Nidhhi Agerwal: ఆ తమిళ డైరెక్టర్.. అందరిముందు ‘ఆ పని’ చేయమన్నాడు

Nidhhi Agerwal Kalaga

Nidhhi Agerwal Kalaga

Nidhhi Agerwal Shares A Strange Incident During Kalaga Thalaivan Audition: సినీ పరిశ్రమలో ఉన్న నటీనటులకు అప్పుడప్పుడు కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతుంటాయి. మంచి స్థాయిలో ఉన్న తారలు సైతం ఇందుకు మినహాయింపు కాదు. వాళ్ల కూడా ఏదో ఒక సందర్భంలో ఊహించని ఘటనల్ని ఎదుర్కుంటుంటారు. తనకూ అలాంటిదే ఒక ఘటన జరిగిందని, అప్పుడు కాసేపు తానూ అయోమయంలో పడిపోయానని నిధీ అగర్వాల్ తెలిపింది. తాను నటించిన ‘కలగ తలైవన్’ సినిమా షూటింగ్ సమయంలో ఆ అనూహ్య ఘటన చోటు చేసుకున్నట్టు నిధీ తెలిపింది.

నిధీ మాట్లాడుతూ.. ‘‘ఒక రోజు నాకు తమిళ దర్శకుడు మగిళ్ తిరుమేణి నుంచి ఫోన్ వచ్చింది. ఒక సినిమా గురించి మాట్లాడాలని చెప్పగా.. నేను కలుస్తానని వెంటనే చెప్పాను. ఆయన చెప్పిన రోజు స్పాట్‌కి వెళ్లా. అప్పుడు నన్ను చూసిన వెంటనే ఆయన ‘ముందు ముఖాన్ని శుభ్రపరచుకో’ అని చెప్పారు. ఆ మాట విన్నాక కొన్ని సెకన్ల పాటు నేను అలాగే ఉండిపోయా. ఎందుకలా అన్నారన్నది వెంటనే పసిగట్టలేకపోయా. ఆ తర్వాత కోలుకొని, ముఖం శుభ్రం చేసుకొని వచ్చాను. నా ముఖ కవళికలను మాత్రమే ఫోటోషూట్ చేశారు. అనంతరం ఈ సినిమాలో మేకప్ లేకుండా నటించాలని ఆయన తెలిపాడు. అప్పుడు ముఖం శుభ్రం చేసుకోమని ఎందుకు చెప్పారో అర్థమైంది’’ అంటూ నిధీ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

ఇక ఇందులో కథానాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ నటించగా.. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవమని నిధీ పేర్కొంది. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపింది. తన సహ నటీనటులకు స్టాలిన్ ఎంతో గౌరవం ఇస్తారని.. వ్యక్తిగతంగా ఆయనకు ఎన్నో సమస్యలు, పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ.. షూటింగ్‌లో వాటిని కనబరిచేవారు కాదని చెప్పింది. ప్రస్తుతం తాను తమిళ సినిమాలు చేస్తున్నందున.. తమిళభాషను నేర్చుకుంటున్నానని పేర్కొంది.

Exit mobile version