NTV Telugu Site icon

Director Bobby: మెగా ఫ్యామిలితో త్వరలో మరో సినిమా…

Director Bobby

Director Bobby

మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మాస్ గెటప్ లో చూపించి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. మెగా అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ హిట్ ఇచ్చిన బాబీకి మెగా ఫాన్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాడు బాబీ. ఈ సమయంలో బాబీకి మెగా ఫాన్స్ ఘన స్వాగతం పలికారు. సక్సస్ జోష్ లో ఉన్న బాబీ “వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు అబ్రాడ్ లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడమే పెద్ద గిఫ్ట్ గా భావిస్తున్నా. వాల్తేరు వీరయ్య యూనిట్ మొత్తం సినిమా విజయోత్సవ ఆనందంలో ఉన్నాం. మెగా ఫ్యామిలి హీరోతో త్వరలో మరో సినిమా చేస్తున్నాను.  పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అంటూ బాబీ మాట్లాడాడు.

బాబీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చేశాడు, చిరుతో వాల్తేరు వీరయ్య సినిమా చేశాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ హీరోల లిస్టులో మిగిలింది రామ్ చరణ్, అల్లు అర్జున్ లు మాత్రమే. ప్రస్తుతం చరణ్ అండ్ బన్నీలు చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యి ఉన్నారు. ఇలాంటి టైంలో వారితో సినిమా అంటే బాబీ చాలా రోజులు వెయిట్ చెయ్యాల్సి వస్తుంది. చిరు లాంటి హీరోతో చేసిన తర్వాత బాబీ మళ్లీ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తాడా? అనేది ఆలోచించాల్సిన విషయమే. మెగా స్టార్ హీరోస్ ఫ్రీ అయ్యేలోపు బాబీ బయట హీరోతో సినిమా చేసి మళ్లీ మెగా కాంపౌండ్ లోకి వెళ్తాడా అనేది చూడాలి.

Show comments