Site icon NTV Telugu

Newsence Teaser: ‘న్యూసెన్స్’ చేస్తున్న నవదీప్…

Navadeep

Navadeep

Newsence Teaser: టాలీవుడ్ కుర్ర హీరో నవదీప్ ఈ మధ్య వెండితెరపై సందడి చేయడం లేదు. అప్పుడెప్పుడో అల వైకుంఠపురంలో చిత్రంలో బన్నీ ఫ్రెండ్ గా కనిపించిన నవదీప్ ఆ తరువాత కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. ఇక నవదీప్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. తాజాగా నవదీప్ హీరోగా వస్తున్న సీరీస్ న్యూసెన్స్. శ్రీపవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇక ఈ సిరీస్ లో నవదీప్ సరసన బిందు మాధవి నటిస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజగా ఈ సిరీస్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఇందులో నవదీప్, బిందుమాధవి రిపబ్లిక్ అనే ప్రెస్ లో జర్నలిస్ట్స్ గా కనిపిస్తున్నారు.

Sridevi: శ్రీదేవి చివరి ఫోటో.. కన్నీళ్లు ఆగడం లేదే

ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక రాజకీయ నాయకుడు.. తన మీటింగ్ కు ప్రజలకు డబ్బు ఇచ్చి పిలిపించుకొని.. అందరి మూడ్ను మాత్రం తానూ డబ్బు ఇవ్వకపోతేనే ఇంతమంది వచ్చారు అంటే.. డబ్బు ఇచ్చి ఉంటే ఇంకెంతమంది వచ్చేవారో అన్న మాట అనగానే.. నవదీప్ తన ప్రెస్ ఐడీ తీసి.. పక్కనే ఉన్న మహిళను చెప్పుతో సదురు నాయకుడిని కొట్టమని సైగ చేస్తాడు. ఇక చెప్పు దెబ్బ తిన్న ఆ నేత ప్రజలను బూతు మాటలు తిడుతూ స్టేజ్ దిగడం, నవదీప్ ను బిందు మాధవి సీరియస్ గా చూడడంతో టీజర్ ముగిసింది. టీజర్ ను బట్టి సమాజంలో జరుగుతున్న అసలు సిసలు రాజకీయం గురించి గట్టిగా చూపించనున్నారని అర్ధమవుతోంది. ఇక ఈ టీజర్ ను పోస్ట్ చేస్తూ ఆహా.. “మీరు చూసే ప్రతి న్యూస్ నిజమేనా..? లేదా నిజమని చూపిస్తున్నారా..? తెలుసుకోవాలంటే న్యూసెన్స్ చూడండి” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి నవదీప్ చేస్తున్న న్యూసెన్స్ ఏంటో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version