కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విగ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. గురువారం చెన్నైలోని మహాబలిపురంలోని ఒక రిస్టార్ లో అత్యంత సన్నహితుల మధ్య ఈ జంట వివాహం జరిగింది. ఇక పెళ్లి తరువాత నయన్- విగ్నేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట తిరుపతిలోనే వారి వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన తిరుపతి నుంచి మహాబలిపురానికి మార్చారు. ఇక పెళ్లి జరిగిన తెల్లారే ఈ జంట దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని దర్శించుకున్నారు.
శుక్రవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. ఇక కొత్త జంట ఎంతో అందంగా కనిపించారు. పసుపు రంగు చీరలో నయన్ మెరిసిపోతుండగా.. పట్టు బట్టలో విగ్నేష్ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
