విజయ్ సేతుపతిపై దాడిలో కొత్త ట్విస్ట్.. తన్నిన వారికి రూ.1001 రివార్డ్.. ఎప్పటివరకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిపై ఎయిర్ పోర్టులో దాడికి పాల్పడిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఒక ఆగంతకుడు అమాంతంగా విజయ్ సేతుపతిపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ సమయంలోనే విజయ్ సేతుపతిని తన్నిన వారికి ప్రతిసారీ రూ.1001 రివార్డ్‌గా చెల్లిస్తానని హిందూ మక్కల్ కట్చి నాయకుడైన అర్జున్ సంపత్ ప్రకటించడం సంచలనంగా మారింది. ప్రముఖ స్వాతంత్య్రోద్యమ వీరుడు అయ్యి తేవర్ ను విజయ్ సేతుపతి అవమానించాడు. అందుకే అతనిని ఎవరైతే తన్నుతారో వారికి ప్రతిసారి రూ.1001 రివార్డ్‌గా చెల్లిస్తానని ట్వీట్ చేశాడు.
విజయ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పేవరకు ఈ ఆఫర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా, బహిరంగంగా బెదిరింపులకు పాల్పడిన అర్జున్ సంపత్ పై తాజాగా కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 504, సెక్షన్ 506(1) కింద అర్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ విషయమై విజయ్ సేతుపతి సీరియస్ అయినా విషయం తెలిసిందే. ఆ దాడిని తాను సీరియస్ గా తీసుకోలేదని, దాని గురించి మీడియా పెద్దది చేసి రాయొద్దని విజయ్ సేతుపతి మండిపడ్డారు.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!