Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mugguru Kothulu First Look: తెలుగు ఆడియన్స్ కామెడీ జానర్ పై ప్రత్యేకమైన ఆదరణ చూపుతుంటారు. ముఖ్యంగా యూత్‌ను టార్గెట్ చేస్తూ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. ఇప్పుడు అదే తరహాలో ఓ సరికొత్త తెలుగు కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘ముగ్గురు కోతులు’ సినిమా శుక్రవారం తన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. టైటిల్‌కు తగ్గట్టుగానే రూపొందించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముగ్గురు కోతులు’ మూవీని శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్గా కనిపించనున్నారు. ఆగస్టు 21న చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు హీరోలను విభిన్నమైన హావభావాలతో చూపించారు. పోస్టర్‌ను చూస్తేనే సినిమా పూర్తిగా కామెడీ, ఎంటర్టైన్మెంట్తో సాగుతుందనే ఆసక్తి కలుగుతోంది.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
అయితే ఈ సినిమాకు ‘ముగ్గురు కోతులు’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న కాన్సెప్ట్ మరింత ఆసక్తికరంగా ఉంది. మహాత్మా గాంధీజీకి సంబంధించిన చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనే మూడు కోతుల సూత్రాలను ఆధారంగా చేసుకుని నేటి యువత వాటిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నారనే అంశంతో కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ ఆలోచనను కామెడీ కోణంలో తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగా ముగ్గురు హీరోల పాత్రలు ఎలా ఉంటాయి? వారి మధ్య ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
ఇప్పటికే ‘ముగ్గురు కోతులు’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన చిత్రబృందం.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా పాటలు, టీజర్‌కు సంబంధించిన వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో సినిమా కథ, హీరోల పాత్రలు, కామెడీ ట్రాక్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇక ఈ సినిమాకు యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఎస్. సుహాస్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ నోముల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జమీర్ షేక్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కొత్త నటీనటులు, కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునేలా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్ లుక్‌లోనే ముగ్గురు హీరోల కామెడీ యాంగిల్‌ను హైలైట్ చేయడంతో ‘ముగ్గురు కోతులు’పై ఆసక్తి మొదలైంది. గాంధీజీ మూడు కోతుల సూత్రాలను నేటి పరిస్థితులకు అన్వయిస్తూ ఎలాంటి కథను చెప్పారు? ముగ్గురు హీరోల జీవితాల్లో ఎలాంటి కామెడీ గందరగోళం చోటుచేసుకుంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూస్తేనే తెలుస్తుంది. త్వరలో టీజర్, పాటలతో పాటు మరిన్ని వివరాలు బయటకు రానుండటంతో ‘ముగ్గురు కోతులు’పై యూత్‌లో మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.
- Tags
- cinema
- Mugguru Kothulu
తాజావార్తలు
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు