NTV Telugu Site icon

The RajaSaab : సంక్రాంతికి కొత్త రాజా సాబ్.?

Raajasaab

Raajasaab

సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్లో మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. సంక్రాంతి శుభసూచికంగా కొత్త సినిమాలు అప్డేట్స్ వరుసపెట్టి వస్తుంటాయి. బడా హీరోల ఫ్యాన్స్ అంతా సంక్రాంతి అప్డేట్స్‌ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు.

Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్

కానీ గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. దీంతో ఈ సంక్రాంతికి రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్‌ను కొత్త పోస్టర్‌తో ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే మేకర్స్ సైడ్ నుంచి ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గాయం కారణంగా ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్‌ మోడ్‌లో ఉన్నాడు. డార్లింగ్ యూరప్‌లో ఉన్నట్టుగా సమాచారం. తిరిగొచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. మార్చి ఫస్ట్ వీక్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హార‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి రాజాసాబ్ నిజంగానే వాయిదా పడనుందా, ఒకవేళ పడితే కొత్త రిలీజ్ డేట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Show comments