The RajaSaab : సంక్రాంతికి కొత్త రాజా సాబ్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పండగ అంటేనే సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. థియేటర్లో మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయితే.. సంక్రాంతి శుభసూచికంగా కొత్త సినిమాలు అప్డేట్స్ వరుసపెట్టి వస్తుంటాయి. బడా హీరోల ఫ్యాన్స్ అంతా సంక్రాంతి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు.
Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఆ రెండు సినిమాలు ఔట్
Also Read
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
కానీ గ్రాఫిక్స్ వర్క్, పోస్ట్ ప్రోడక్షన్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. దీంతో ఈ సంక్రాంతికి రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్‌ను కొత్త పోస్టర్‌తో ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే మేకర్స్ సైడ్ నుంచి ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గాయం కారణంగా ప్రస్తుతం ప్రభాస్ రెస్ట్ మోడ్‌లో ఉన్నాడు. డార్లింగ్ యూరప్‌లో ఉన్నట్టుగా సమాచారం. తిరిగొచ్చిన తర్వాత రాజాసాబ్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. మార్చి ఫస్ట్ వీక్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి రాజాసాబ్ నిజంగానే వాయిదా పడనుందా, ఒకవేళ పడితే కొత్త రిలీజ్ డేట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!