Twins as Heros: అప్పుడు రామ్ – లక్ష్మణ్… ఇప్పుడు రామకృష్ణ – హరికృష్ణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSR movie makers: కవలలు సినిమాల్లో నటించిన సందర్భాలు, కీలక పాత్రలు పోషించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే కవలలు కలిసి హీరోలుగా నటించడం అనేది చాలా అసాధారణం. అప్పట్లో ఫైటర్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న కొత్తలో రామ్-లక్ష్మణ్ హీరోలుగా రెండు మూడు సినిమాలు చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఫైట్ మాస్టర్స్ గా స్థిరపడ్డారు. ఇవాళ వాళ్ళు స్టార్ ఫైట్ కొరియోగ్రాఫర్స్ గా ఎదిగారు! తాజాగా అన్నదమ్ములైన రామకృష్ణ, హరికృష్ణ సైతం హీరోగా నటించబోతున్నారు. వీరితో వారి తండ్రి తిరుపతి శ్రీనివాసరావు ఓ సినిమాను ప్రారంభించబోతున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ‘టి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్’ లోగోను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ”టాలీవుడ్ లో మా కంటూ ఓ స్థానం ఏర్పరుచుకునేందుకు ఈ సంస్థను ప్రారంభిస్తున్నాం. త్వరలో షూటింగ్ ను మొదలుపెడతాం. మా పిల్లలు రామకృష్ణ, హరికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాను. ఈ సినిమాకు స్టంట్ మాన్ బద్రీ అన్న సహకరిస్తున్నారు” అని చెప్పారు. బద్రీ మాట్లాడుతూ, ”ఈ కవలలిద్దరూ నటులుగా చక్కని పేరు తెచ్చుకుంటారనే నమ్మకం ఉంది. కష్టపడిన వారికి తప్పకుండా విజయం లభిస్తుంది” అని అన్నారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ‘బస్టాప్’ కోటేశ్వరరావు, ‘మీలో ఒక్కడు’ నిర్మాత కుప్పిలి శ్రీనివాస్, అశోక్ కుమార్, ‘రచ్చ’ రవి, అరుంధతి శ్రీనివాస్ తదితరులు చిత్ర నిర్మాత శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
తాజావార్తలు
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
-
Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?