Site icon NTV Telugu

RRR : కోలీవుడ్ డైరెక్టర్స్ కు కొత్త తలనొప్పి… అంతా రాజమౌళి వల్లే !!

Rajamouli

RRR అద్భుతమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ మూవీ అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి రూపొందించిన విధానం అందరికీ బాగా నచ్చింది. వారి మధ్య స్నేహం, ఘర్షణ, మళ్ళీ కలవడం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ వండర్ అంటూ అందరూ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ లో మాత్రం జక్కన్న తీరు దర్శకులకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా ?

Read Also : RRR : అతనొక్కడే… మహేష్ బాబు రివ్యూ

సహజంగానే రాజమౌళి గురి తప్పదు. తనదైన స్ట్రాటజీతో, దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లడం రాజమౌళికి మాత్రమే చెల్లుతుంది. థియేటర్లో ఉన్నంత సేపూ అదే ప్రపంచమేమో అన్నట్టుగా సినీ ప్రియులు భ్రమలో ఉండేటట్టు చేయడంలో రాజమౌళి దిట్ట. అందుకే ఆయన ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిభ కలిగిన టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ఇక టాలీవుడ్ సినిమా పరిధిని ఖండాతరాలకు విస్తరింపజేసింది రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సౌత్ లో కంటెంట్ ఆధారిత సినిమా అనగానే తమిళ చలనచిత్ర పరిశ్రమ గుర్తుకు వస్తుంది. కంటెంట్ మాత్రమే కాదు సాంకేతికంగా కూడా తమిళ సినిమాల రేంజ్ వేరు. అయితే రాజమౌళిలాగా సినిమాలను ఎందుకు తెరకెక్కించలేకపోతున్నారు ? అని తమిళ దర్శకులకు అక్కడి ప్రేక్షకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అక్కడ మంచి నటీనటులు, టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ బిగ్ కాన్వాస్ మూవీస్ రావట్లేదు. అదే ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ఆవేదన. సోషల్ మీడియా వేదికగా రాజమౌళిని చూసి నేర్చుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఒక్కరంటే ఒక్క దర్శకుడు కూడా ‘ఆర్ఆర్ఆర్’లా ఇద్దరు స్టార్స్ ను తెరపైకి తీసుకురాలేకపోతున్నారని అంటున్నారు. సౌత్ సత్తా చాటే సమయం ఇదేనని, రాజమౌళి వంటి దర్శకులు పాన్ ఇండియా సినిమాలకు సుగమం చేసిన మార్గాన్ని వినియోగించుకోవాలని తమిళ దర్శకులకు సూచిస్తున్నారు.

Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”… కానీ హిందీలో కాదు !!

విజువల్‌గా అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడమే కాకుండా, అందులో వినోదాన్ని మిళితం చేసి రాజమౌళి చేసే సినిమాలు భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను యిట్టే ఆకట్టుకుంటున్నాయి. పైగా టాలీవుడ్ లో కమర్షియల్ అంశాలను జోడించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం అనే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. దానితో పాటే రాజమౌళి తన ట్యాలెంట్ తో కొన్ని అద్భుతమైన అంశాలను జోడించి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లాంటి అద్భుతాలను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇక సుకుమార్ వంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ సైతం ఆయన అడుగు జాడల్లో నడుస్తూ టాలీవుడ్ ను భారతీయ సినీ పరిశ్రమలోనే ఒక పెద్ద సినీ ఇండస్ట్రీగా నిలపడానికి కృషి చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా ఎలాంటి తుఫాన్ ను సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ వైపు చూడడానికి రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులే కారణం. ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగం నడుస్తోందని చెప్పొచ్చు. దీంతో కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా అలాంటి సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఇదే ఇప్పుడు తమిళ దర్శకులకు కొత్త తలనొప్పిగా మారింది.

Exit mobile version