Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ్ లో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజ కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమాను S. శశికాంత్ & చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఎలక్షన్ల నేపథ్యంలో సాగే కథ కాబట్టి.. సరైన సమయంలోనే ఈ కథను తీసుకొని మేకర్స్ తెలివిగా ఆలోచించారు అనిపిస్తోంది. అక్టోబర్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే సంపూ.. మరో సినిమాను పట్టాలెక్కించేశాడు. బేవర్స్ సినిమాతో హీరోగా పరిచయమైన సంజోష్, సంపూ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CANS ఎంటర్‌టైన్‌మెంట్స్ & మాంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్ర చాగన్ల నిర్మిస్తున్నాడు.
నేడు దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి.. ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమాకు.. సోదరా అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. ట్యాగ్ లైన్ గా ఇట్స్ ఏ బ్రోమాంటిక్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. అంటే.. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ అన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ గా సంపూ, సంజోష్ కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 29 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ప్రాచీ బన్సల్, ఆరతి గుప్తా హీరోయిన్స్ గా నటిస్తుండగా బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా .. వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని సమాచారమా. మరి ఈ సినిమాతో సంపూ, సంజోష్ ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.
