NTV Telugu Site icon

Prabhas: ఇకపై ఇలా ఉండదు… హ్యాపీ బర్త్ డే ‘సలార్’!

Prabhas

Prabhas

బాహుబలికి ముందు ఓ లెక్క… ఆ తర్వాత ఓ లెక్క అనేలా పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు డార్లింగ్. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఫ్లాప్ టాక్‌తో వందల కోట్లు రాబట్టి… తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు డార్లింగ్. కానీ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అది ఈ ఏడాది చివర్లో జరగబోతోంది. డైనోసర్‌గా ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని… ఇప్పటికే సలార్ టీజర్ చూసి ఫిక్స్ అయిపోయారు. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది. ఇక్కడి నుంచి ప్రభాస్ బాక్సాపీస్ లెక్కలు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లనున్నాయి. ఎందుకంటే… నెక్స్ట్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు ప్రభాస్. బాహుబలి తర్వాత మొహమాటానికి పోయి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేసిన ప్రభాస్.. నెక్స్ట్ సలార్ పార్ట్ వన్, పార్ట్ 2.. కల్కి, మారుతి ప్రాజెక్ట్‌తో పాటు.. స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది.

ప్రభాస్ అనఫీషియల్‌గా హనురాఘవపూడితో లవ్‌స్టోరీ లాక్ చేశాడు. అలాగే బాలీవుడ్‌ డైరెక్టర్ సిద్ధార్త్ ఆనంద్‌ కూడా లైన్లో ఉన్నాడు. ఇక మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌… లియో ప్రమోషన్స్‌లో ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌ కన్ఫామ్ చేశాడు. వీళ్లతో పాటు సుకుమార్ కూడా లైన్లో ఉన్నాడు. అలాగే దిల్ రాజు బ్యానర్లో మరోసారి ప్రశాంత్ నీల్‌తో ‘రవణం’ అనే భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. వీళ్లే కాదు… ఇండియాలో ఉన్న బడా బడా డైరెక్టర్స్ అంతా ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో సుధ కొంగర, త్రివిక్రమ్, క్రిష్, రాజ్ కుమార్ హిరాణీ లాంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇక ఫైనల్‌గా ప్రభాస్, రాజమౌళి కాంబో మరోసారి రిపీట్ అవనుంది. అది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’ కూడా అయి ఉండవచ్చు. ఇందులో ప్రభాస్‌ కర్ణుడు అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు జక్కన్న. ఏదేమైనా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా రారాజు అనిపించుకున్న ప్రభాస్‌కు… హ్యాపీ బర్త్ డే అంటూ సోషల్ మీడియాను ఇప్పటి నుంచే షేక్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.