Site icon NTV Telugu

Manchu Lakshmi: మోహన్ బాబు కూతురు స్మగ్లర్ అంట..?

Manchu Lakshmi

Manchu Lakshmi

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడే బాషతోనే ఎంతో ఫేమస్ అయ్యిపోయి అభిమానులలో మంచు అక్క గా మారిపోయింది. ఇక ఈమె ఏమి చేసిన ట్రోలర్స్ కు పండగే.. ఏ పని చేసినా ఆమెపై విమర్శల అస్త్రాలు సంధిస్తుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తోంది అని, మంచు మోహన్ బాబు కూతురువు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఎవరు భరిస్తారు అంటూ ఘాటుగా మంచు లక్ష్మీని ట్రోల్స్ చేస్తుంటారు. అయితే వీటిని మంచక్క లైట్ తీసుకొని తన పని ఏదో తాను చేసుకుంటూ పోతుంది. నిత్యం సోషల్ మీడియా లో రీల్స్ అని, కూతురు, మేనకోడళ్లతో కలిసి హుషారుగా ఉండే లక్ష్మీ తాజాగా తన సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టి మళ్లీ ట్రోలింగ్ కు గురైంది. తన షూ కలెక్షన్స్‌ సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ క్యాప్షన్ గా “సరైన షూ ఎప్పుడు ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఫొటోలో ఐదు జతల షూస్ ను ముందు వేసుకొని.. ఇంకేమి కొత్తవి లేనట్లు బుంగమూతి పెట్టుకొని కూర్చోంది. ఇక వెనుక మాత్రం షూ షో రూమ్ లా లెక్కలేనన్ని జతల షూస్ ఉండడం గమనార్హం. ఇక ఈ ఫొటోపై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు.. అన్ని ఉన్నా నీకు ఏది వేసుకోవాలో తెలియడం లేదా.. మీరు అంతా అంతే.. కాళ్లు కాలే కాళ్లు ఒక చోట.. లెక్కలేనన్ని జోళ్లు ఒకజ చోట అని కొందరు.. షూ షాప్ ఏమైనా పెడుతున్నావా..? లేక షూ స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నావా..? అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం మీ షూ కలెక్షన్స్ బావున్నాయని, మీరు ఏది వేసుకున్నా అందంగానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version