NTV Telugu Site icon

Prakash Raj: చంద్రయాన్ 3 సక్సెస్.. ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది

Prakash

Prakash

Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి అందులోకి దిగితే ప్రకాష్ రాజ్ కనిపించడు.. ఆ పాత్రనే కనిపిస్తుంది. అలాంటి విలక్షణ నటుడును ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.. విమర్శిస్తున్నారు.. అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అందులో ఈరోజు చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యాకా ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. అసలు ప్రకాష్ రాజ్ ను ఎందుకు అరెస్ట్ చేయమంటున్నారు. ఆయన చేసిన తప్పు ఏంటి.. ? ప్రకాష్ రాజ్ కు.. చంద్రయాన్ 3 కు ఉన్న సంబంధం ఏంటి.. ? అని అంటే.. ప్రకాష్ రాజ్.. సినిమాల వరకు విలక్షణ నటుడే కానీ, ఆయన రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం అందరికి తెల్సిందే. ముఖ్యంగా బీజేపీ కి ఆయన వ్యతిరేకి. నిత్యం మోడీపై విమర్శలు చేస్తూనే ఉంటాడు.ఇక చంద్రయాన్ 3ను పంపేటప్పుడు ప్రకాష్ రాజ్ ఒక ఫోటోను షేర్ చేస్తూ మోడీని, ఇస్రో శాస్త్రవేత్తలను అవమానించాడు.
Rakul Preet Singh: అవకాశాలు లేకపోయినా.. అన్ని కోట్లు పెట్టి కారు కొన్నదా.. ?

విక్రమ్ ల్యాండర్‌ దిగిన వెంటనే తీసిన ఫోటో అంటూ.. ఇస్రో శాస్త్రవేత్తలు ఛాయ్ కలుపుతున్నట్లు ఉన్న కామిక్ ను షేర్ చేశాడు. అదుగో అప్పుడు మొదలయ్యింది ప్రకాష్ రాజ్ ను అరెస్ట్ చేయాలని.. ఇక ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో..ఇస్రో శాస్త్రవేత్తలకు శుబాకాంకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. “భారతదేశానికి మరియు మానవాళికి గర్వకారణమైన క్షణం.. ఇస్రో శాస్త్రవేత్తలకు శుబాకాంకాంక్షలు. ఇది జరగడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది మన విశ్వం యొక్క రహస్యాన్ని అన్వేషించడానికి మాకు మార్గనిర్దేశం చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అని నెటిజన్స్ ట్రోల్ చేయడం మొదలుపెడుతున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యేసరికి ఈయనకు ఎక్కడో మండుతున్నట్లు ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.