Site icon NTV Telugu

BiggBoss 6: ఛీ ఛీ.. ఈసారి కూడా వారి ముఖాలనే చూడాలా..?

Nag

Nag

BiggBoss 6: బుల్లితెర అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మరికాసేపట్లో మొదలు కానుంది. ఎప్పటిలానే ఈ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే బిగ్ బాస్ అంటే గిట్టని వారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ల పేర్లు తెలుసుకున్న వారు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి సీజన్ లో తప్పితే ఇప్పటివరకు కొద్దిగా పేరు ఉన్న సెలబ్రిటీలను తీసుకొచ్చింది లేదు. టిక్ టాక్ స్టార్లు, యూట్యూబ్ రివ్యూ చెప్పేవారు, సీరియల్స్ లో నటించేవారు, యాంకర్స్, జబర్దస్త్ కమెడియన్స్. సీజన్ 5 లో ఉన్నట్లే సీజన్ 6 లోను ఇదే ఫార్ములాను వాడారు షో యాజమాన్యం. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు టీవీ లోనూ, ఇన్స్టాగ్రామ్ లోనూ చూసే ముఖాలను తప్ప పెద్ద సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు వారిని తీసుకొస్తే బావుంటుందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక కంటెస్టెంట్ల గురించి చెప్పుకోవాలంటే.. టిక్ టాక్ స్టార్లు.. గీతా రాయల్, ఆరోహి ఉండగా బిగ్ బాస్ రివ్యూ లు చెప్పి ఫేమస్ అయ్యిన యూట్యూబర్ ఆది రెడ్డి మరో కంటెస్టెంట్ గా ఉన్నాడు. యాంకర్స్.. నేహా చౌదరి, ఆర్జే సూర్య ఉండగా.. జబర్దస్త్ నుంచి చలాకీ చంటి, ఫైమా ఉన్నారు. ఇక వీరితో పాటు కొద్దో గొప్పో చెప్పుకోతగిన వారు అంటే సింగర్ రేవంత్, నటుడు బాలాదిత్య, నువ్వు నాకు నచ్చావ్ తో కెరీర్ మొదలుపెట్టిన సుదీప(పింకీ) ఉన్నారు. ఇక వీరితో పాటు అందాలు ఆరబోయడానికి ఐటెం సాంగ్స్ చేసి మెప్పించిన అభినయ శ్రీ, వర్మ గర్ల్ ఇనయా సుల్తానా ఉండగా.. రియల్ కపుల్ గా మెరీనా, రోహిత్ జంట ఎంటరవుతున్నారు. ఇక మేము లేనిదే బిగ్ బాస్ లేదు అన్నట్లు సీరియల్ నటులు అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్, శ్రీ సత్య తదితరులు ఉన్నారు. మొత్తానికి ఫైనల్ లిస్ట్ అయితే ఇది. కానీ ఈసారి కూడా కంటెస్టెంట్ల విషయంలో అభిమానుల మనసులను గెలవలేకపోయారు షో యాజమాన్యం. నిజం చెప్పాలంటే వీరిలో చాలామంది ప్రేక్షకులకు తెలియదు అంటే అతిశయోక్తి కాదు. దేవుడా వీరు చేసే ఓవర్ యాక్షన్ రోజూ చూస్తూనే ఉన్నాం.. మళ్లీ ఇంకో మూడు నెలలు చూడాలా అని కొంతమంది తలలు కొట్టుకుంటున్నారు. మరి వీరు ఏ రేంజ్ లో అభిమానులను అలరిస్తారో చూడాలి.

Exit mobile version