బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒక పక్క షోలతో మరోపక్క సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే.. చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ పుష్ప 2 లో కూడా మంచి పాత్రను పట్టేసింది. ఇక సినిమాల గురించి పక్కన పెడితే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అనసూయ నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది అనడంలో సందేహం లేదు.. అనసూయ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో హేటర్స్ కూడా అంతేమంది ఉన్నారు. ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఇద్దరు పిల్లల తల్లివి ఇలాంటి డ్రెస్ లు వేసుకుంటావా..? అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే అనసూయ ఏ మాత్రం తగ్గేదే లే అంటూ వారికి ధీటుగా కౌంటర్లు వేస్తూ ఉంటుంది.
ఇది నిత్యం జరిగే విషయమే .. తాజాగా మరోసారి అనసూయ ట్రోలర్స్ చేతికి చిక్కింది. ఇటీవల ఒక కొత్త షోకు యాంకరింగ్ చేస్తున్న అనసూయ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫోటోలలో అనసూయ ముఖం తేడాగా కనిపిస్తోంది. మేకప్ మహిమో లేక ఆమె ఒరిజినల్ ముఖమో తెలియదు కానీ అనసూయ ముఖంలో కల లేదు.. ముఖం అంతా ముడతలు పడినట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఆమెను ఆడేసుకున్నారు.. అనసూయ.. ముఖం చూస్కో.. ముసలిదానివైపోతున్నావ్ అని కొందరు.. మేకప్ తక్కువ వేసుకున్నావా ఒరిజినల్ ముఖం తెలిసిపోతుంది అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై ముద్దుగుమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.