Site icon NTV Telugu

Nayanthara: మెడలో పసుపుతాడుతో ఏంటా పని నయన్.. విగ్నేష్ నీకైనా బుద్ధి ఉండొద్దా..?

Nayan

Nayan

Nayanthara: కోలీవుడ్ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ ప్రస్తుతం భార్యాభర్తల బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కిన ఈ జంట హానిమన్ ను త్వరగా ముగించుకొని ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారిపోయారు. ఇక ఆ తరువాత కొద్దిగా టైమ్ దొరికినా హాలిడే ట్రిప్ కు చెక్కేస్తున్నారు. ఇటీవలే ఈ జంట బార్సిలోనా కు వెకేషన్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. ఇక అక్కడ భార్యతో గడిపిన మెమరీబుల్ మూమెంట్స్ ను విగ్నేష్ క్యాప్చర్ చేసి అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా లేడీ సూపర్ స్టార్ కూల్ పిక్ ను షేర్ చేసిన విగ్నేష్.. తన భార్య అందాన్ని పొగుడుతూ రాసుకొచ్చాడు. ఇక్కడివరకు బాగానే ఉన్నా ఫొటోలోనే నయన్ డ్రెస్ కాస్తా ఎబెట్టుగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా నయన్ మెడలోని పసుపుతాడు ఫొటోకే వన్నె తెచ్చినట్లు కనిపించింది. అయితే ఆ డ్రెస్ కొద్దిగా కిందకు ఉండడం, నయన్ ఎద భాగమంతా స్పష్టంగా కనిపిస్తుండడంతో నెటిజన్లు ఈ జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.

పెళ్లి తరువాత పవిత్రమైన మాంగల్యాన్ని ధరించి నయన్ సాంప్రదాయాలను కాపాడుతోంది మేము కాదండంలేదు.. కానీ ఇలాంటి డ్రెస్ లు వేసుకొని ఆ పసుపుతాడును హైలైట్ చేయడం వలన ఏమి ప్రయోజనం.. విగ్నేష్ నీ భార్య అందాలను అందరికి చూపించడానికి నీకు బుద్ధి లేదా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోపక్క అది వారి ఇష్టం.. వారిని అనడానికి ఎవరికి హక్కులేదు. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి..? పసుపుతాడు ఏ డ్రెస్ మీద వేసుకోవాలి అని మీరెలా నిర్ణయిస్తారు అంటూ ఈ జంటను సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ జంట కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం నయన్.. షారుక్ ఖాన్ సరసన జవాన్ లో నటిస్తుండగా.. విగ్నేష్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.

Exit mobile version