భారత హాకీ చరిత్రలో గురువారం (ఆగస్టు 5) చరిత్రలో గుర్తుండిపోయే రోజు. మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్య పతకం సాధించింది. 1980 మాస్కో తర్వాత ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఇదే మొదటి పతకం. ఈవెంట్ మొత్తంలో 12వ పతకం. దీంతో పురుషుల హాకీ జట్టును ట్విట్టర్ లో అభినందనలు వెల్లువతో ముంచెత్తారు. ప్రధానితో పాటు క్రీడా దిగ్గజాలు, బాలీవుడ్, టాలీవుడ్ తారలు ప్రతి ఒక్కరూ వారి గెలుపును చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. అయితే బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ మాత్రం పురుషుల బదులుగా మహిళల హాకీ జట్టు విజయం సాధించింది అంటూ పొరపాటున తప్పుగా అభినందించారు.
Read Also : నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా” లుక్
అతను తన తప్పును గ్రహించి వెంటనే తన ట్వీట్‌ను తొలగించాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. కొంతమంది నెటిజన్లు వెంటనే ఫర్హాన్ ‘తప్పు ట్వీట్’ స్క్రీన్‌షాట్ తీసి ఫర్హాన్ ను ట్రోల్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ తరువాత ఆయన తన తప్పును సరిదిద్దుకుని పురుషుల హాకీ జట్టును అభినందించారు. అయినప్పటికీ నెటిజన్లు ఆయనను వదలకుండా ట్రోల్ చేస్తూనే ఉండడం గమనార్హం.
