NetFlix : సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కు నెట్‌ఫ్లిక్స్ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలు ఎక్కువగా పలు భాషల్లో విడుదల అవుతూ వస్తున్నాయి. గతంలో అయితే కొన్ని సినిమాల డబ్బింగ్ వెర్షన్ ఎప్పటికో విడుదలయ్యేవి. అందుకు కారణం వాటి రీమేక్, డబ్బింగ్ హక్కులు ఒరిజినల్ నిర్మాతల దగ్గర ఉండటమే. దానికి బెస్ట్ ఉదాహరణ ‘విక్రమ్ వేద’. దీనిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయకపోవడానికి, రీమేక్ విషయంలో ఫెయిల్ అవడానికి కూడా ఇదే కారణం. అయితే హిందీ వెర్షన్ మాత్రం ఈ నెలాఖరున విడుదలకాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల మలయాళంలో విడుదలైన ‘తల్లుమల’ సినిమా ఘన విజయం సాధించింది. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయటానికి పలువురు ప్రయత్నించారు. యువహీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కూడా అలా ప్రయత్నం చేసిన వారిలో ఉన్నారు.
ఈ హీరోలు పంపిన నిర్మాతలు హక్కులను సొంతం చేసుకునేందుకు ఆఫర్ చేసిన ఫిగర్స్ మరీ తక్కువ స్థాయిలో ఉండటంతో ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ నెట్‌ఫ్లిక్స్ వైపు దృష్టిసారించారు. టోవినో థామస్ నటించిన ‘తల్లుమల’ సాధారణ కథాంశంతో కూడినది అయినా ఎడిటింగ్, కథను చెప్పటంలో వైవిధ్యం వంటివి బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిపాయి. ఇక టోవినో థామస్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్‌లో చక్కటి ఆదరణ ఉండటంతో స్ట్రీమింగ్ సైట్ ఈ చిత్రాన్ని తమ ప్లాట్‌ఫారమ్‌లో అన్ని భాషలలో విడుదల చేయడానికి భారీ మొత్తాన్ని మేకర్స్‌కు ఆఫర్ చేసింది. దాంతో నిర్మాతలు సైతం తెలుగు రీమేక్ కోసం వేచి చూడకుండా నెట్ ఫ్లిక్స్ కే అమ్మేశారు. స్ట్రీమింగ్ సైట్ కూడా ఆలస్యం చేయకుండా అన్ని భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ‘తల్లుమల’ మలయాళ వెర్షన్ 11వ తేదీ నుంచే అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ చూపించిన స్పీడ్ కి మన హీరోలు కూడా షాక్‌తో బిత్తరపోయారు. ఏది ఏమైనా ముద్దొచ్చినపుడే చంక ఎక్కాలి. అంతే కానీ చూద్దాంలే అనుకుంటే వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లే. ఏమంటారు?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!