శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. బహుముఖ నటుడు జగపతి బాబు, కెజిఎఫ్ రామచంద్ర రాజు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ‘మహా సముద్రం’ థియేటర్‌లో విడుదలైన రెండు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులోకి వస్తుంది.
Read Also : సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన ‘మహా సముద్రం’ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ కాగా, ప్రవీణ్ ఈ చిత్రానికి ఎడిటర్. అక్టోబర్ 14న దసరా కానుకగా ‘మహా సముద్రం’ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న సిద్ధార్థ్ తో పాటు చిత్రబృందం సినిమా విజయవంతం అవుతుందని నమ్మకంతో ఉన్నారు.