Site icon NTV Telugu

Tillu Square: ఏం .. రాధికా.. ఇంకా మా టిల్లుగాడిని వదలవా.. ?

Tillu

Tillu

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు కు సీక్వెల్ ఈ సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 15 న రిలీజ్ కానుంది. డీజే టిల్లుతో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది హీరోయిన్ నేహా శెట్టి. రాధికగా ఆమె మారిపోయింది. ఇక టిల్లుతో అమ్మడు చేసిన రొమాన్స్.. అతడిని మోసం చేయడం.. జైలుపాలు అవ్వడం ఇదంతా డీజే టిల్లులో చూపించారు. ఇరాక్ టిల్లు స్క్వేర్ లో టిల్లు.. ఇంకో అమ్మాయిని పటాయించడం.. ఆమెతో రొమాన్స్ ఉండనుంది. కొత్త అమ్మాయిగా అనుపమ కనిపించనుంది.

Pawan Kalyan: విదేశాలకు పవన్ కళ్యాణ్.. దానికోసమేనట..?

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టిల్లు స్క్వేర్ లో కూడా రాధికా ఎంట్రీ ఉంటుంది అంట.. కొద్దిసేపు టిల్లు స్క్వేర్ లో రాధికా సందడి చేయనుందట. దీంతో రాధికా ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. ఒక చిన్న క్యామియో రోల్ కోసం నేహాను సంప్రదించడం.. ఆమె ఓకే చెప్పడం కూడా జరిగిందట. ఇక ఈ షూట్ కూడా నేహా ఫినిష్ చేసిందని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఏం .. రాధికా.. ఇంకా మా టిల్లుగాడిని వదలవా.. ? అని కొందరు.. రాధికా ఫ్యాన్స్ అసెంబుల్ అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాలో రాధికా ఇంకెన్ని మనసులను విరగొడుతుందో చూడాలి.

Exit mobile version