Site icon NTV Telugu

OG : ఓజీలో కత్తిలాంటి మరో హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే..

Neha Shetty

Neha Shetty

OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 25న వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అని తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ వచ్చింది. హాట్ బ్యూటీ నేహాశెట్టి ఈ సినిమాలో కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ మూవీలో కొన్ని సీన్లతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. నేహాశెట్టి అసలే బోల్డ్ బ్యూటీ. కత్తిలాంటి అందాలకు కేరాఫ్‌ అడ్రస్. అలాంటి ఆమె స్పెషల్ సాంగ్ అంటే అందాల ఆరబోతకు హద్దులు ఉండవు.

Read Also : SSMB 29 : మహేశ్ బాబుతో కొత్త ప్లేస్ లో రాజమౌళి షూటింగ్..

పవన్ కల్యాణ్‌ యాక్షన్ సీన్లతో పాటు నేహాశెట్టి అందాలకు కుర్రాళ్లకు డబుల్ ట్రీట్ పక్కా అంటున్నారు. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో మూవీ పనుల్లో వేగం పెంచారు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ డబ్బింగ్ పనులు కంప్లీట్ చేసేస్తున్నారు. ఇంకోవైపు స్పెషల్ సాంగ్ ఫైనల్ వర్క్స్ కూడా జరిగిపోతున్నాయి. అటు వైపు రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఒకే టైమ్ లో వరుస పనులను కంప్లీట్ చేసి రిలీజ్ టైమ్ కు ఫ్రీ అయిపోవాలని చూస్తున్నారంట. మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్‌ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Read Also : Bigg Boss 9 : నాగార్జుననే తప్పు బట్టిన మాస్క్ మ్యాన్ హరీష్‌.. ఏంట్రా ఇది..

Exit mobile version