Site icon NTV Telugu

Neha Shetty: ఫ్యామిలీ తో నేహా శెట్టి బర్త్డే సెలెబ్రేషన్స్.. వైరల్ అవుతున్న పిక్స్..

Whatsapp Image 2023 12 09 At 3.22.44 Pm

Whatsapp Image 2023 12 09 At 3.22.44 Pm

యంగ్ బ్యూటీ నేహాశెట్టి‏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మూవీ లో హీరోయిన్‏గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో ఎంతగానో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కూడా ఈ భామ అదరగొట్టేసింది. ఈ మూవీతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్స్ వచ్చాయి.ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే బెదురులంక 2012 మూవీతో ఈ భామ హిట్ అందుకుంది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజాన్ తో ప్రేక్షకులను పలుకరించగా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్ ఆఫ్ గోదావరి లో హీరోయిన్ గా నటిస్తుంది.

అదేవిధంగా ఈ భామకు కన్నడలో కూడా వరుస అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి నేహా శెట్టి 2016 లో నే ఓ కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాతో నేహా శెట్టి కి గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన డీజే టిల్లు మూవీ తో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 5న నేహా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు మరియు సినీ సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇక నేహా తన బర్త్ డే సెలబ్రెషన్స్ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.. నేహా షేర్ చేసిన ఫోటోస్ లో ఆమె తల్లిదండ్రులు మరియు చెల్లెలు వున్నారు.దీంతో ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

Exit mobile version