NTV Telugu Site icon

Neha Shetty: స్టేజిపై చీరతో విశ్వక్ ను చుట్టేసి రొమాన్స్ చేసిన నేహా..

Vishwak

Vishwak

Neha Shetty: మెహబూబా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నేహా శెట్టి. మొదటి సినిమానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించేసరికి అమ్మడికి మంచి ప్యూచర్ ఉంటుంది అని అనుకున్నారు. అయితే సక్సెస్ కు ఎప్పుడు లేట్ అవుతుంది అని పెద్దలు చెప్పినట్లుగానే.. నేహా శెట్టికి డీజే టిల్లుతో నేహాకు సక్సెస్ దక్కింది. ఈ సినిమా తరువాత కూడా అమ్మడికి అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. అయినా నేహా నిరాశపడకుండా తన టైమ్ వచ్చేవరకు వెయిట్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర హీరోల ఫస్ట్ ఛాయిస్ గా నిలిచింది నేహా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్, కార్తికేయ తో బెదురులంక 2018, విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో నటిస్తోంది.

Gangs of Godavari: విశ్వక్ తో నేహా లిప్ లాక్.. రాధికా ఇచ్చినట్టు హ్యాండ్ ఇవ్వదు కదా

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో సుట్టంలా సూసి పోకలా సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. ఇందులో నేహా అందాలు హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా సుట్టంలా సూసి పోకలా.. చుట్టేసుకోవే చీరలా.. చక్కాని చంటివాడిలా.. చేస్తానే నువ్వు చెప్పిందల్లా అనే లిరిక్స్ కు ఈ జంట చేసిన హుక్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ స్టేజిపై ఈ లిరిక్స్ కు హుక్ స్టప్స్ వేసి అలరించారు విశ్వక్, నేహా. చీర చెంగును విశ్వక్ కు చుట్టి.. సాంగ్ లో వేసినట్టే అందరి ముందు చీర కొంగు విప్పి నేహా డ్యాన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్ గా మారింది. ఒక హీరోయిన్ ఇలా స్టేజిపై రొమాన్స్ చేయడం చాలా క్రేజీ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో నేహా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

స్టేజి మీదే రొమాంటిక్ డ్యాన్స్ | Gangs of Godavari Suttamla Soosi Song Launch Event  | Ntv ENT