Site icon NTV Telugu

“నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ రిలీజ్ చేసిన బుట్టబొమ్మ

Nee Valle Nee Valle Lyrical Song from Ichchata Vahanamulu Niluparadu

బుట్టబొమ్మ పూజాహెగ్డే “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఈ సాంగ్ సుశాంత్ హీరోగా నటిస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. చిత్రంలోనిది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 27 న విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ లక్కరాజు ట్యూన్ చేసిన “నీ వల్లే” సాంగ్ లీడ్ పెయిర్ మధ్య మనోహరమైన కెమిస్ట్రీతో కూడిన బ్రీజి, మెలోడీ నంబర్. సుశాంత్, మీనాక్షి చౌదరి జత తెరపై తాజాగా కనిపిస్తుంది. శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా, సంజిత్ హెగ్డే తన వాయిస్ తో మంత్రముగ్ధులను చేశాడు.

Read Also : దుమ్మురేపేద్దాం… పవన్ ఫ్యాన్స్ కు తమన్ ప్రామిస్

దర్శన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి మరియు హరీష్ కొయ్యలగుండ్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం ఒక నవల కాన్సెప్ట్‌తో విలక్షణమైన థ్రిల్లర్‌గా రూపొందింది.

Exit mobile version