NTV Telugu Site icon

NC23: క్యాస్టింగే కాదు మ్యూజిక్ కు కూడా స్టార్ నే దింపుతున్నట్టున్నారే..?

Nc23

Nc23

NC23: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఒక గట్టి హిట్ కోసం కష్టపడుతున్నాడు. మిగతా హీరోలందరూ పాన్ ఇండియా సినిమా లంటూ వెళ్లిపోతుంటే.. చై మాత్రం ఇంకా నార్మల్ సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. ఈ విషయంలో అక్కినేని కుటుంబం మొత్తం వెనుకే ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. కార్తికేయ 2 తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చై సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో లవ్ స్టోరీ లాంటి హిట్ రావడంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో మత్స్యకార జీవితాల నుంచి రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో చందూ ఒక స్టొరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారి జీవితాల గురించి తెలుసుకోవడానికి చై.. మత్స్య కారులను స్వయంగా కలిసి చాలా తెలుసుకున్నాడు.

Nayanathara: భార్య-పిలల్ల పిక్స్ షేర్ చేసిన విగ్నేష్.. నయనతార కొడుకులు ఎంత క్యూట్ ఉన్నారో చూశారా?

ఇక చందూ ఈ సినిమా కోసం స్టార్ క్యాస్టింగ్ ను దింపుతున్నట్లు తెలుస్తోంది. కేవలం క్యాస్టింగ్ మాత్రమే కాకుండా మ్యూజిక్ కూడా మంచి స్టార్ నే రంగంలోకి దింపుతున్నాడని సమాచారం. ముందు ఈ సినిమా కోసం అనిరుధ్ ను అనుకున్నారట. అయితే.. పెద్ద సినిమాలతో అతడు బిజీగా మారడంతో అతడి స్థానంలో సంతోష్ నారాయణన్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దసరా సినిమాకు సంతోష్ నే సంగీతం అందించాడు. ఆ సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ చిత్రానికి సంతోష్ కరెక్ట్ అని మేకర్స్ భావించి ఆయనను ఖరారు చేసారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments