NBK 112 : బాలయ్య – కొరటాల సినిమా ఓపెనింగ్‌కు అతిధులుగా ఇద్దరు మంత్రులు

Nbk 112

Nbk 112

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో NBK112 రాబోతున్న సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధా ఆర్ట్స్ ఈ సినిమాను  అత్యంత ప్రతిష్టాత్మక  నిర్మిస్తున్నాయి. ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ పవర్‌ఫుల్ కాంబో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది.

ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. దైవసన్నిధిలో ఏపీ రాజధాని నడిబొడ్డున ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన కీలక నేతలు కూడా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, బాలయ్య బాబు అల్లుడు నారా లోకేష్ తో పాటు ఏపీ సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రానున్నారు. “పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బెకమ్స్ ఎ మూవ్‌మెంట్” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చేరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్, బాలయ్య రేంజ్ మాస్ ఎలివేషన్లతో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

×
×
Ad