నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “NBK107”. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పాత్రలో కన్పించనుండగా, దునియా విజయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు తమన్ సంగీతం అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్.
Read Also : Samantha : అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్… వీడియో వైరల్
“NBK107” చిత్రీకరణ ఈరోజు సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ షూటింగ్‌లో బాలకృష్ణపై భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తెరకెక్కిస్తున్నారు. ముందుగా యాక్షన్ తోనే రంగంలోకి దిగారు బాలయ్య. మూవీలో కొన్ని ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇంకా నిర్ణయించలేదు మేకర్స్. కానీ “జై బాలయ్య” అనే టైటిల్ అనుకుంటున్నారని సినిమాను ప్రకటించినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. ‘క్రాక్’తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ బాలయ్యతో సినిమా తీస్తుండడంతో అప్పుడే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
