Site icon NTV Telugu

NBK 107 First Look : నందమూరి నటసింహం ఊర మాస్ అవతారం..

nandamuri balakrishna

nandamuri balakrishna

అఖండ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలోని బాలయ్య లుక్ లీకైన విషయం తెల్సిందే. దీంతో ముందుగానే జాగ్రత్త పడిన మేకర్స్ లీకులను ఎంకరేజ్ చేయకుండా బాలయ్య బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇక నందమూరి నటసింహం ఫస్ట్ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. బ్లాక్ షర్ట్.. గ్రే కలర్ లుంగీలో ఇంటెన్స్ గా నడుచుకుంటూ వస్తున్న బాలయ్య లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మునుపెన్నడు చూడని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో షేడ్‌తో డాపర్‌గా బాలయ్య కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి అఖండ తో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version