Site icon NTV Telugu

Unstoppable 2 : పవన్ ప్రోమో వచ్చేసిందిరోయ్..

Pawan Kalyan

Pawan Kalyan

Unstoppable 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. మొట్టమొదటిసారి పవన్ ఒక టాక్ షో కు రావడం.. అది నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి రావడం పెను సంచలనాన్నే సృష్టించింది. ఇక ఇప్పటికే షూటింగ్ కూడా ముగించుకున్న ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా..? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆహా మేకర్స్ పోస్టర్స్ తో ప్రోమోస్ తో అభిమానుల అంచనాలను ఆకాశానికి ఎత్తేలా చేసేశారు. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన కొత్త ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. 4 నిముషాలు ఉన్న ఈ ప్రోమో ఆద్యంతం ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించింది. పవన్ గ్రాండ్ ఎంట్రీ, బాలయ్య సరదా మాటలు, పవన్ సోల్ ఫుల్ నవ్వు.. అభిమానుల కళ్లలో ఆనందం.. వెరసి ప్రోమో మొత్తం కన్నుల పండుగగా కనిపించింది.

ప్రభాస్ ఎపిసోడ్ లానే పవన్ ఎపిసోడ్ ను కూడా రెండు పార్ట్ లుగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇక బాలయ్య సరదాగా మొదలుపెట్టిన ప్రశ్నలు.. చివరికి సీరియస్ గా మారిన విధానం కనిపించింది. ఈశ్వరా.. పరమేశ్వర.. పవనేశ్వర అంటూ బండ్ల గణేష్ ను ఇమిటేట్ చేస్తూ బాలయ్య మాట్లాడిన తీరు నవ్వులు పూయిస్తోంది. ఇక గుడుంబా శంకర్ లో ఫ్యాన్ ట్ మీద ప్యాంట్ వేయడం దగ్గరనుంచి ప్రశ్నల వర్షం కురిపించాడు బాలయ్య. ఇక త్రివిక్రమ్ తో స్నేహం, అన్న చిరుతో అనుబంధం, మూడు పెళ్లిళ్లు, రాజకీయాలు ఇలా సెరియస్ టాపిక్స్ తో పాటు పవన్ చిన్నతనాన్ని కూడా బాలయ్య వెలికి తీసాడు. ఇక మధ్యలో రామ్ చరణ్ కు ఫోన్ చేసి ఫిట్టింగ్ మాస్టర్ అని బాలయ్య సంబోధించడం నిజంగా ఆశ్చర్యాన్ని రేకెత్తించే విషయమే. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంట్రీతో మరిన్ని నవ్వులు పూశాయి. మామ మూడ్ను చేతులు కట్టుకొని ఆయన దగ్గరనుంచి ఏం నేర్చుకున్నాడో చెప్పడం.. దానికి పవన్ కౌంటర్ వేయడం ఆకట్టుకుంది. తేజ్ సైతం తొడకొట్టు అని బాలయ్య అనగానే డైరెక్ట్ గా వెళ్లి బాలయ్య తొడమీద కొట్టడం అభిమానుల ముఖం మీద నవ్వులు తెప్పించింది. ఇక చివర్లో పవన్ మూడు పెళ్లిళ్ల విషయం ఎత్తి షో మొత్తం హీట్ ఎక్కించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=g8lf5PCFLHY&ab_channel=ahavideoIN

Exit mobile version