NTV Telugu Site icon

Balakrishna: బాలయ్య “50 వసంతాల” స్వర్ణోత్సవ సంబరాల కోసం భారీ ఏర్పాట్లు

Nbk Golden Jubilee Celebrations

Nbk Golden Jubilee Celebrations

NBK Golden Jubilee Celebrations: కనీవినీ ఎరుగని రీతిలో , కన్నుల పండుగగా బాలయ్య “50 వసంతాల” స్వర్ణోత్సవ సంబరాలు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు నందమూరి అభిమానులు. 1974 “తాతమ్మ కల ” సినిమాతో NTR నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగి… ” తండ్రికి తగ్గ తనయుడు”గా అందరి ప్రశంసలు పొంది , విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న లెజెండ్ బాలయ్య సినీ ప్రస్థానం 50 వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. భారతదేశ సినీ చరిత్రలో నట వారసుడిగా 50 యేండ్లు పూర్తి చేసుకున్న ఏకైక అగ్ర హీరోగా బాలయ్య కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టారని అభిమానులు చెబుతున్నారు. తన తండ్రి NTR తర్వాత నేటి తరంలో పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలు చేసి.. అన్ని జనరేషన్స్ ప్రేక్షకుల్ని మెప్పించిన ఒకే ఒక్కడు బాలయ్య కావడం మన తెలుగువారందరికీ గర్వకారణమని చెబుతున్నారు.

Bharateeyudu 3: అసలు మ్యాటర్ అక్కడే ఉంది.. దాచాం లోపల!

ఈ క్రమంలో ఈ ప్రతిష్టాత్మక 50 వసంతాల బాలయ్య సినీ స్వర్ణోత్సవ సంబరాలను NBK HELPING HANDS అధ్యక్షుడు అనంతపురం జగన్ బాలయ్య అభిమానులను ఒక టీంగా ఏర్పాటుచేసి అత్యంత వైభవంగా 50 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున కూడా హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. గతంలో NBK HELPING HANDS ఆధ్వర్యంలో బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కోసం 70 రోజుల పాటు భారతదేశ శత పుణ్యక్షేత్ర జైత్రయాత్ర చేపట్టి వార్తల్లో నిలిచారు. అలాగే బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకలను విశ్వవ్యాప్తంగా ఉండే బాలయ్య అభిమానలు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఒకే సమయంలో తొంభై వేల మందికి పైగా కేక్ కట్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు మరోసారి నేటి నుంచి ఆగస్టు 30 దాకా బాలయ్య “50 వసంతాల” స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుపనున్నారు.