బాలయ్య నెక్స్ట్ సినిమా డైలాగ్ లీక్ చేసిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో 2021లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందించిన రోరింగ్ హిట్ తో బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విజయంతో వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం బాలయ్య 107వ ప్రాజెక్ట్. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారని టాక్. అలాగే ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా… మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నుంచి డైలాగ్ లీక్ అయ్యింది.
Rea Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
Also Read
ఆ డైలాగ్ ను లీక్ చేసింది ఎవరో కాదు స్వయంగా డైరెక్టరే ! అసలు విషయం ఏమిటంటే.. బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోకు రవితేజతో పాటు గోపీచంద్ మలినేని కూడా హాజరయ్యారు. ఈ షోలో బాలయ్య మన సినిమాలో నుంచి ఒక డైలాగ్ లీక్ చేయండి అని అడగ్గా… గోపీచంద్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలారు. అదేంటంటే… “రోడ్డు మీదకు జింక, గొర్రె వస్తే ఎవడైనా హార్న్ కొడతాడు… అదే సింహం వస్తే హార్న్ కాదు కదా ఇంజిన్ కూడా ఆఫ్ చేసి సైలెంట్ గా ఉంటాడు.. అక్కడ ఉంది సింహం” అంటూ బాలయ్య పాత్ర హీరోయిజాన్ని ఎలివేట్ చేసే పవర్ డైలాగ్ ను వదిలాడు. ఈ షో ప్రసారం అయినప్పటి నుంచి ఈ డైలాగ్ ట్రెండ్ అవుతోంది ”అన్ స్టాపబుల్’గా!!
తాజావార్తలు
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!