NTV Telugu Site icon

NBK: అఖండ కాంబినేషన్ రిపీట్ అయ్యింది… టెలికాస్ట్ ఎప్పుడో?

Akhanda

Akhanda

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలయ్య ఇప్పుడు సూపర్బ్ క్రేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. బ్యాక్ టు మిలియన్ డాలర్ సినిమాలు, వందల కోట్ల వసూల్ చేసిన సినిమాలు బాలయ్య నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా అన్-స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ మరింత మరింత పెరిగింది. జై బాలయ్య అనే స్లోగన్ ఒకప్పుడు నందమూరి అభిమానులకి మాత్రమే పరిమితం అయ్యేది, ఇప్పుడు జై బాలయ్య అనేది సెలబ్రేషన్ స్లోగన్ లా మారిపోయింది. అమలాపురం నుంచి అమెరికా వరకూ ప్రతి సెలబ్రేషన్ కి, ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఇంటర్వెల్ లో, ఏ ఫంక్షన్ జరిగినా సందడి మొదలయ్యే టైంలో, అన్ని పబ్బులు క్లోజింగ్ టైంలో… ఇలా ఎప్పుడు క్రేజీనెస్ కావాలన్నా వినిపించే ఒకే ఒక్క స్లోగన్… ‘జై బాలయ్య’. ఈ జనరేషన్ యూత్ కూడా బాలయ్యకి ఫాన్స్ అయ్యారు.

Read Also: Varisu: యుట్యూబ్ ని షేక్ చేస్తున్న జిమిక్కీ పొన్ను…

అఖండ సినిమా టికెట్ రేట్స్ తక్కువ ఉన్న సమయంలో కూడా కోట్ల వర్షం కురిపించింది అంటే ఎంత మంది ఆడియన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్ కి వెళ్ళారో అర్ధం చేసుకోవచ్చు. సినిమాల నుంచి టాక్ షోకి, టాక్ షో నుంచి కమర్షియల్స్ చేసే వరకూ పెరిగిన బాలయ్య క్రేజ్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. బాలయ్య ప్రస్తుతం ఒక జ్యువెల్లరి కమర్షియల్ ని షూట్ చేస్తున్నాడు. ఈ యాడ్ లో బాలయ్య పక్కన ప్రాగ్య జైశ్వాల్ కూడా కనిపించనుంది. బాలయ్య-ప్రాగ్య జైశ్వాల్ అనగానే అందరికీ అఖండ సినిమా గుర్తొస్తుంది. ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ షూట్ చేస్తున్న కమర్షియల్ లో బాలయ్య చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాడు. మరి టీవీలో ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి.

Read Also: Balayya: వీర సింహం ఒటీటీలో దిగుతుంది…

Show comments