NTV Telugu Site icon

Ajay Devgn: ఖైదీ రీమేక్ లోకి అమలా పాల్ వచ్చిందే…

Ajay Devgn

Ajay Devgn

తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న అజయ్ దేవగన్, తాను అసలు ఖైదీ సినిమాని ‘భోలా’గా రీమేక్ చెయ్యట్లేదేమో అని డౌట్ వచ్చే రేంజులో అప్డేట్స్ ఇస్తున్నాడు. ముందుగా భోలా సినిమా గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసిన మేకర్స్, విజువల్స్ ని అందరికీ షాక్ ఇచ్చారు. ఖైదీ సినిమాలో హీరో కార్తీ త్రిశూలం పట్టుకోని తిరగడు కదా మరి అజయ్ దేవగన్ ఏంటి అలా తిరుగుతున్నాడు అనే దగ్గర మొదలైన డౌట్స్… ప్రతి అప్డేట్ కి పెరుగుతూనే వచ్చింది. తాజాగా టీజర్ తో మరోసారి ఇది ఖైదీ రీమేకా లేక అఖండ సినిమా రీమేకా అనే డౌట్ కలిగించిన అజయ్ దేవగన్, భోలా టీజర్ తో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు.

Read Also: Bholaa Teaser: సార్ ఇది ఖైదీ సినిమాలా లేదే…

లేటెస్ట్ గా భోలా సినిమా నుంచి ‘నజర్ లగ్ జాయేగి’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో అజయ్ దేవగన్ తో పాటు అమలా పాల్ కూడా కనిపించడం విశేషం. ఖైదీ సినిమాలో కార్తీ తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు కానీ లోకేష్ కనగరాజ్ దాన్ని చూపించడు. హీరో ఫ్యామిలీ బ్యాక్ స్టొరీ చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నాడో ఏమో కానీ అజయ్ దేవగన్ మాత్రం ‘హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్’ని ఫుల్ లెంగ్త్ లో ప్రెజెంట్ చేస్తున్నట్లు ఉన్నాడు. ఆ లవ్ ట్రాక్ లో భాగంగా వచ్చే పాటనే ఈ ‘నజర్ లగ్ జాయేగి’ సాంగ్. ఈ లిరికల్ వీడియోలో అజయ్ దేవగన్ రౌడీగా తిరుగుతున్న సమయంలో, డాక్టర్ అయిన అమలా పాల్ కి ఎలా పరిచయం అయ్యాడు, ఇద్దరి మధ్య ఎలా రిలేషన్షిప్ బిల్డ్ అయ్యింది? చివరికి అమలా పాల్ కి ఏం అయ్యింది? అనే విషయాలని చూపించారు. సాంగ్ వినడానికి, చూడడానికి బాగుంది కానీ ఇది ఖైదీ రీమేక్ లో ఉన్న సాంగ్ అనే విషయం గుర్తోస్తేనే ఎక్కడో తేడా కొడుతుంది. అయితే నార్త్ ఆడియన్స్ కి అజయ్ దేవగన్ ఖైదీ సినిమాకి చేస్తున్న మార్పులు నచ్చే అవకాశం ఉంది.

Show comments