Site icon NTV Telugu

డిసెంబర్‌ 10న ‘నయీం డైరీస్‌’

గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కిన సినిమా ‘నయీం డైరీస్‌’. దీనిని డిసెంబర్‌ 10న విడుదల చేయనున్నారు. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ టైటిల్ రోల్‌ పోషించాడు. సీఏ వరదరాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ కు చక్కని స్పందన వచ్చింది. రాజకీయ, పోలీస్‌ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయన్నది ధైర్యంగా ఈ సినిమాలో చూపించామని దర్శకుడు దాము చెబుతున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత తప గురించి పూర్తిగా అధ్యాయనం చేసి తీశానని, నయీం అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు తను కూడా విప్లవకారుడుగా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నానని, ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో తెలుసు కాబట్టి డ్రమటిక్‌గా ఇందులో చూపించానంటున్నారు. నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా వర్గాల నుంచే కాకుండా సమాజం లో విభిన్న వర్గాల నుండి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని దర్శకుడు దాము అంటున్నాడు. యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్‌, శశి కుమార్‌, జబర్దస్త్‌ ఫణి నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సురేష్‌ భార్గవ్‌ అందించగా సంగీతాన్ని అరుణ్‌ ప్రభాకర్‌ సమకూర్చారు.

Exit mobile version