NTV Telugu Site icon

Nayanthara: ఇదెక్కడి కాంబో.. ప్రదీప్ సరసన నయన్..?

Nayan

Nayan

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. గతేడాది ఆమె ఇద్దరు ట్విన్స్ కు తల్లి అయిన విషయం తెల్సిందే. ఒకపక్క తల్లిగా బాధ్యతలు చూసుకుంటూనే.. ఇంకోపక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. షారుఖ్ ఖాన్ సరసన నయన్ తొలిసారి నటించడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత భర్త విగ్నేష్ శివం దర్శకత్వంలో అజిత్ సరసన ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ మధ్య అజిత్ కు, విగ్నేష్ కు మధ్య అనుకోని క్లాషెస్ రావడంతో ఆ సినిమా నుంచి విగ్నేష్ తప్పుకున్నాడు. ఇక భర్త విగ్నేష్ కు గౌరవమిచ్చి నయన్ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది.

RC15: SSMB28 రిలీజ్.. RC15 వాయిదా..?

ఇకపోతే ఈ గ్యాప్ లోనే విగ్నేష్ కొత్త స్క్రిప్ట్ ను రెడీ చేసి కుర్ర హీరో ప్రదీప్ రంగనాథన్ కు వినిపించి ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లవ్ టుడే సినిమాతో తెలుగు, తమిళ్ భాషలను షేక్ చేసిన హీరో, దర్శకుడు ప్రదీప్. ప్రస్తుతం తాను డైరెక్ట్ చేస్తూనే సినిమాలు కూడా తీస్తున్నాడు. కథ నచ్చడంతో ప్రదీప్ సైతం ఓకే అన్నాడట. ఎప్పటిలానే ఈ చిత్రంలో కూడా నయనే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇక్కడే వచ్చింది చిక్కు. ప్రదీప్ తో నయన్ రొమాన్స్ ఏంటి..?. అతనెక్కడ ..? నయన్ ఎక్కడ..? అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రదీప్ సరసన నయన్ అక్కలా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. అయితే విభిన్నమైన కథ కావడంతో ఈ కాంబో వర్క్ అవుట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments