NTV Telugu Site icon

Nayanthara : మరోసారి ఆ స్టార్ హీరోకు జోడిగా నయన్.. డైరెక్టర్ ఎవరంటే?

Nayan (3)

Nayan (3)

స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంటున్న నయనతార ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్త వినిపిస్తుంది.. అది కూడా మలయాళ సినిమా.. మలయాళ స్టార్ మమ్ముట్టి, నయన్ కాంబోలో మరో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్..

కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వతగగా మలయాళి వ్యక్తి.. చెన్నైలో పుట్టి పెరిగిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, తమిళ సినిమాలతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన మలయాళంలో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.. ఈయన మొదటి సినిమా మమ్ముట్టి తో చేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు మరో సినిమా చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నయన్, మమ్ముట్టి కాంబోలో ‘తస్కర వీర’లో మమ్ముట్టి, నయనతార జోడీ తొలిసారి యాక్ట్ చేసింది. ఆ తర్వాత ‘రప్పకల్’ చేశారు. ఆ తర్వాత చేసిన ‘భాస్కర్ ది రాస్కెల్’, ‘పుతియా నియమం’ సినిమాలు వచ్చాయి.. ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబోలో మరో సినిమా రాబోతుందని తెలుస్తుంది…ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. హిందీ సినిమా ఇండస్ట్రీకి ఆవిడ ఇంట్రడ్యూస్ అయిన ‘జవాన్’ భారీ సక్సెస్ సాధించింది. ఇక, తమిళంలో నటించిన ‘అన్నపూరణి సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ను అందుకుంది..

Show comments