NTV Telugu Site icon

NayanThara: ప్రియుడు కోసం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నే క్యాన్సిల్ చేసిందా..?

Nayan

Nayan

సాధారణంగా ఏ స్టార్ హీరోయిన్ కి అయినా తన స్థాయి పెంచుకోవాలని ఉంటుంది. ఆ రేంఙ్ లో ఉన్నప్పుడు ఇండియాకు ప్రాధాన్యత వహించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కాదు అనదు.. వెళ్లకుండా మానదు. కానీ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం ఈ అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. 75వ కేన్స్‌ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌ దేశంలోని కేన్స్‌ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయిన విషయం విదితమే, ఈ అంతర్జాతీయ వేడుకకు మన దేశం తరపున ఏఆర్‌ రెహమాన్, శేఖర్‌ కపూర్, మాధవన్, నవాజుద్దిన్‌ సిద్ధిఖి, తమన్నా, నయనతార, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలా, దీపికా పదుకొనేకు ఆహ్వానం అందింది. ఇక ఈ ఆహ్వానం అందుకోవడమే అరుదైన గౌరవం. దీంతో అందురూ ఎంతో ఆనందంగా కేన్స్‌ నగరంలో అడుగుపెట్టారు. ఒక్క నయనతార తప్ప.. ఆమె ఈ వేడుకలకు గైర్హాజరు అయ్యారు. అయితే ఈ ఫెస్టివల్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ అని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే వివాహంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విఘ్నేష్ ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడట.. దీంతో అన్ని పనులు అతడిపై వేసి వెళ్లలేక.. నయన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ను క్యాన్సిల్ చేసుకున్నదని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఈ వార్త పై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ప్రియుడికి హెల్ప్ చేయడానికి ఇంటర్నేషనల్ వేడుకకు హాజరుకాలేదా ..? విడ్డురంగా ఉంది.. ఇదెక్కడి ప్రేమ అని కొందరు.. అలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది.. దానిని మిస్ చేసుకొంది అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం నయన్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె జీవితంలో జరగబోయే అతి పెద్ద పండగ ఈ పెళ్లి.. అలాంటప్పుడు అవన్నీ దగ్గర ఉండి చూసుకోవడంలో తప్పేమి ఉందని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లని నయన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎందుకు ఆమె ఈ వేడుకలకు అటెండ్ కాలేదు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.