Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సారి దీపావళి వేడుకలకు కొద్దిమందిని మాత్రమే తన ఇంటికి పిలిచారు చిరంజీవి. అందులో నాగార్జున, వెంకటే, నయనతార ఉన్నారు. వీరి ఫొటోలను దీపావళి రోజున చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు చేశాడు. వారికి స్పెషల్ గిఫ్ట్ లను కూడా అందించాడు. అయితే తాజాగా నయనతార మరో అరుదైన ఫొటోను షేర్ చేసింది. వాస్తవానికి చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో నయనతార మాత్రమే ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీలో నయనతార నటిస్తోంది కాబట్టి ఆమెను మాత్రమే చిరు ఇంటికి పిలిచాడని అంతా అనుకున్నారు.
Read Also : Udhayanidhi Stalin : నటి గ్లామర్ ఫొటోలు షేర్ చేసిన డిప్యూటీ సీఎం.. ఒకటే రచ్చ
కానీ నయనతార ఫ్యామిలీ మొత్తం చిరంజీవి ఇంటికి వెళ్లింది. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నయనతార చిరంజీవి ఇంట్లో సందడి చేసింది. ఈ సందర్భంగా చిరుతో నయన్ ఫ్యామిలీ ఫొటోలు దిగింది. ఈ ఫొటోలను తాజాగా నయనతార షేర్ చేసింది. ఈ దీపావళి చాలా స్పెషల్ గా గడిచింది. నా మనసు ప్రేమతో నిండిపోయింది. నా చుట్టూ ఉన్న మనుషులను చూస్తే నా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది అంటూ చెప్పుకొచ్చింది. ఇంకేముంది క్షణాల్లోనే ఈ ఫొటోలు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. విఘ్నేశ్ శివన్, నయనతార చిరు ఇంట్లోని పూజగదిలో స్పెషల్ గా ఫొటో దిగారు.
Read Also : Naresh : నిర్మాతలు డబ్బులిస్తే సరిపోదు.. గౌరవం ఇవ్వాలి
Family and Friends ⚡️ Unconditional Love ❤️ pic.twitter.com/7Dd1MdJfnY
— Nayanthara✨ (@NayantharaU) October 21, 2025
