Connect Teaser: నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసి నయన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. టీజర్ ను బట్టి ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అమ్మా తలుపు తీయ్.. భయమేస్తోంది అని గదిలో ఒక యువతీ తలుపులు బద్దలు కొట్టడం.. మధ్యలో నయన్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ భయపడుతున్నట్లు చూపించారు.
ఇక చివర్లో నయన్ ఆ రూమ్ తలుపు తీయగానే చిత్రమైన రూపంతో చీకట్లో కనిపిస్తున్న ఆకారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇక చివర్లో బెడ్ పై దెయ్యం లేచి అరవడం చూస్తే ప్యాంట్ తడిసిపోతుంది అని చెప్పాలి. టీజర్ మొత్తం ఆత్యంత ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఒళ్లు గగుర్పొడిచే సీన్ లతో వణుకు పుట్టించేలా ఉంది. మాయ సినిమా తరువాత నయన్, అశ్విన్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నయన్ ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
