Connect Teaser: పుట్టినరోజున అంతలా భయపెట్టాలా నయన్.. ప్యాంట్ తడిసిపోతుందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Connect Teaser: నయనతార ప్రధాన పాత్రలో అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సత్యరాజ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసి నయన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. టీజర్ ను బట్టి ఈ సినిమా హర్రర్ కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అమ్మా తలుపు తీయ్.. భయమేస్తోంది అని గదిలో ఒక యువతీ తలుపులు బద్దలు కొట్టడం.. మధ్యలో నయన్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ భయపడుతున్నట్లు చూపించారు.
ఇక చివర్లో నయన్ ఆ రూమ్ తలుపు తీయగానే చిత్రమైన రూపంతో చీకట్లో కనిపిస్తున్న ఆకారం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇక చివర్లో బెడ్ పై దెయ్యం లేచి అరవడం చూస్తే ప్యాంట్ తడిసిపోతుంది అని చెప్పాలి. టీజర్ మొత్తం ఆత్యంత ఉత్కంఠభరిత సన్నివేశాలతో ఒళ్లు గగుర్పొడిచే సీన్ లతో వణుకు పుట్టించేలా ఉంది. మాయ సినిమా తరువాత నయన్, అశ్విన్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నయన్ ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
Also Read
- Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
- Suriya - Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!