టాలీవుడ్‌లోనే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తంలో అత్యంత ఖరీదైన హీరోయిన్‌గా నయనతార తన స్థానాన్ని పదిలం చేసుకుంది. స్టార్ హీరోలకు ధీటుగా పారితోషికం తీసుకుంటూ ఆమె వార్తల్లో నిలుస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు సినిమాకు 40 నుంచి 50 కోట్లు తీసుకుంటుండగా, నయనతార కూడా వీరితో పోటీ పడుతూ భారీగా సంపాదిస్తోంది. గతంలో నయనతార సినిమాలకు సైన్ చేయడం, షూటింగ్ పూర్తి చేయడానికే పరిమితమైంది. ప్రమోషన్లకు దూరంగా ఉండేది. ‘నేనింతే’ అంటూ భీష్మించుకుని కూర్చున్న ఈ నటి ఇప్పుడు తన తీరు మార్చుకుంది. ఇక నుంచి నయనతార భారీ స్థాయిలో ప్రమోషన్లలో పాల్గొనడానికి అంగీకరించింది. ప్రమోషన్ల కోసం అదనంగా తీసుకుంటున్న పారితోషికాన్ని (ప్రమోషనల్ టాక్స్) కూడా తన రెమ్యునరేషన్‌లో కలుపుకోవడంతో, ఈ అమ్మడి పారితోషికం ఒక్కసారిగా 15 నుంచి 18 కోట్ల మధ్యకు చేరింది.
Also Read :Savitri : మహానటికి మరణం లేదు!
గత పదేళ్లుగా సౌత్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నయనతార రికార్డు సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవితో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలకృష్ణ సరసన నటిస్తోంది. నయనతార తన పాత పద్ధతిని పూర్తిగా వదిలిపెట్టింది. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్లకు దూరంగా ఉండే ఈమె ఇప్పుడు మనసు మార్చుకుంది.కొత్త సినిమాలకు సైన్ చేసేటప్పుడే, ప్రమోషన్లకు హాజరు కావాలని ముందే ఒప్పందం చేసుకుంటోంది. చిరంజీవి సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే, నయనతార ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో చేసిందంటే ఆమె ప్రమోషన్ల విషయంలో ఎంత మార్పు వచ్చిందో అర్థమవుతుంది. ఇటీవల, ‘మూకుతీ అమ్మన్ 2’ ఓపెనింగ్‌కు కూడా నయనతార హాజరైంది. ప్రమోషన్ల ద్వారా తన సినిమాలకు మరింత హైప్ తీసుకురావాలని నిర్ణయించుకున్న నయనతార, ఆ ప్రమోషనల్ వర్క్‌కు తగిన పారితోషికాన్ని కూడా భారీ స్థాయిలో వసూలు చేస్తోంది.
