ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లందరూ పెళ్లి బాట పట్టారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్టులో ఉన్న ముద్దుగుమ్మలందరూ పెళ్లి పీటలు ఎక్కేశారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లోకి చేరిపోయింది లేడీ సూపర్ స్టార్ నయనతార.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఐదేళ్లగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతుంది. జూన్ 9న వీరి వివాహం అట్టహాసంగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఈ వివాహం గురించి పక్కన పెడితే.. వివాహం తరువాత నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎప్పటినుంచో నయన్ వైవాహిక బంధంలో కి అడుగుపెట్టాలని చూస్తోంది.
ఒకసారి ప్రభుదేవాతో పెళ్లి పీటలు వరకు వచ్చిన నయన్ పెళ్లి ఆగిపోయింది.. దీంతో ఇంకోసారి అలాంటి ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదట నయన్.. అందుకే పెళ్లి తరువాత నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిగా గృహిణిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నదని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె సైన్ చేసిన సినిమాలన్నీ పూర్తిచేసిందట.. ఇక ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోవడం లేదని సమాచారం. ఇక ఈ విషయమై విఘ్నేష్ కూడా సానుకూలంగా స్పందించాడని, నయన్ కు ఏది ఇష్టమో అది చేయమనే చెప్తానని.. తాను సినిమాల్లో నటించడం తనకు ఇష్టమేనని అంటున్నాడట.. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం నయన్ తెలుగులో గాడ్ ఫాదర్, ఓ2 చిత్రాల్లో నటిస్తుండగా.. మలయాళంలో గోల్డ్ సినిమాలో నటిస్తోంది.
