Site icon NTV Telugu

ప్రియుడితో నయన్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్… బుర్జ్ ఖలీఫా సాక్ష్యం !

nayan

లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్ తో కలిసి న్యూఇయర్ వేడుకను సెలెబ్రేట్ చేసుకుంది. ఈ లవ్ బర్డ్స్ ప్రస్తుతం దుబాయ్‌లో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద ఈ జంట నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. 2022 సమీపిస్తున్న తరుణంలో అక్కడ జరిగిన కౌంట్ డౌన్ క్లిప్‌ను దర్శకుడు పంచుకున్నారు. ఈ జంట కొత్త ప్రారంభం ఉత్సాహం తాజా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

Read Also : ‘పుష్ప’రాజ్ ట్రాన్స్ లో హనుమ విహారి… ఇట్స్ మూవీ టైమ్ !

నయన్, విగ్నేష్ సినిమాల విషయానికి వస్తే… విఘ్నేష్ శివన్, నయనతార ఇటీవల ‘రాకీ’ చిత్రాన్ని కలిసి నిర్మించారు. వసంత్ రవి, భారతీరాజా జంటగా నటించిన ‘రాకీ’ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. 23 డిసెంబర్ 2021న థియేటర్లలో విడుదలైన ఈ ప్రాజెక్ట్‌కి దర్బుక శివ సంగీతం అందించారు. మరోవైపు విఘ్నేష్ శివన్ ‘కాతు వాకుల రెండు కాదల్‌’తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ను ఫిల్మ్‌మేకర్ హోమ్ బ్యానర్ రౌడీ పిక్చర్స్ నిర్మించింది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు కథానాయికలుగా నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Exit mobile version